కల్వకుంట్ల కాదు.. ఎవ్వరినీ కలవకుండా చూసే కుటుంబం వాళ్ళది : బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ సెటైర్లు..

కల్వకుంట్ల కాదు.. ఎవ్వరినీ కలవకుండా చూసే కుటుంబం వాళ్ళది : బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ సెటైర్లు..

ఆదివారం ( ఆగస్టు 31 ) అసెంబ్లీలో బీసీ  రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. రెండు రోజు సమావేశాల్లో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో బీసీ బిల్లుపై మాట్లాడుతూ కేసీఆర్ ఫ్యామిలీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు సీఎం రేవంత్. కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ కాదని.. ఎవ్వరినీ కలవకుండా చూసే ఫ్యామిలీ అని అన్నారు. అందుకే బీసీ బిల్లుకు అడ్డు పడుతున్నారని అన్నారు.

మైనారిటీలు, హిందువులు కలవకుండా, బీసీలు ఓసీలు కలవకుండా, ఎస్సీలు, ఎస్టీలు కలవకుండా చూసే ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ అని అన్నారు సీఎం రేవంత్. ఇప్పటికైనా బీసీ బిల్లును చర్చ లేకుండా ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. బీసీ బిల్లుపై చర్చకు ప్రధాన ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ వచ్చి ఉంటే ఆయన పెద్దరికం నిలబడి ఉండేదని అన్నారు. 

తాను చెడ్డ కోతి వనమల్లా చెరిచినట్లు కేసీఆర్ వ్యవహారం ఉందని అన్నారు. గంగుల కమలాకర్ కేసీఆర్ ఒత్తిడికి లొంగకుండా ఈ బిల్లుకు మద్దతు తెలపాలని అన్నారు సీఎం రేవంత్. రాజకీయ వివాదాలకు తావివ్వకుండా, ఆరోపణలు చేయకుండా.. మంచి ఉద్దేశంతో తెచ్చిన బిల్లుకు మద్దతిచ్చి, అవసరమైతే సలహాలివ్వాలని అన్నారు సీఎం రేవంత్.