మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులివ్వాలి..లేకపోతే అమ్మలే ఆగ్రహిస్తారు: సీఎం రేవంత్

మేడారం జాతరను  జాతీయ పండుగగా గుర్తించి నిధులివ్వాలి..లేకపోతే  అమ్మలే ఆగ్రహిస్తారు: సీఎం రేవంత్

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి కేంద్రం నిధులివ్వాలని డిమాండ్ చేశారు  సీఎం రేవంత్ రెడ్డి.  నిధులివ్వకుంటే అమ్మలే ఆగ్రహిస్తారని అన్నారు సీఎం.  సెప్టెంబర్ 23న  మేడారంలో పర్యటించిన రేవంత్.. అక్కడి బహిరంగ సభలో మాట్లాడారు. 

సమ్మక్క సారక్క దీవెనలతో  పాలన చేస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్. ‘ గత బీఆర్ఎస్ పాలకులు మేడారాన్ని పట్టించుకోలేదన్నారు. గతంలో మేడారం నుంచే పాదయాత్ర చేశానని చెప్పారు.  గడీల పాలన నుంచి ప్రజాస్వామ్య పాలన తీసుకొస్తానని ఇక్కడే చెప్పా.  సంకల్ప బలం ఉన్నవాళ్లు  ఎప్పుడూ ఓడిపోలేదన్నారు. . మేడారం బాధ్యత కాదు భావోధ్వేగం అని అన్నారు . దశాబ్దాలుగా దర్శనానికి ఇక్కడికి వస్తున్నామని చెప్పారు.  అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదు. అభివృద్ధి అంటే ప్రజలు  బాగుపడటం అని  అన్నారు రేవంత్. 

మేడారంలో రాతి కట్టడాలు నిర్మిస్తామని చెప్పారు సీఎం. రాతికట్టడాలు వందేళ్లయినా ఉంటాయన్నారు.  మేడారం అభివృద్దిలో గిరిజనులను భాగస్వాములను చేస్తామన్న సీఎం..  వంద రోజుల్లో పనులు పూర్తయ్యేలా టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. నిధుల విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.  ఎన్ని కోట్లైనా వెచ్చిస్తాం.. సమ్మక్క సారక్క గద్దెలను పునః నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. మేడారం అభివృద్ది  పనులను ప్రతి వారం మంత్రి పొంగులేటి సమీక్షిస్తారని చెప్పారు రేవంత్.  జంపన్న వాగును అభివృద్ది చేస్తామన్నారు.  గిరిజనులు సంప్రదాయాలను కాపాడుతామని తెలిపారు .

 మేడారం అభివృద్ధి జీవితంలో వచ్చిన గొప్ప అనుభూతి అని అన్నారు రేవంత్. ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్దిలో గిరిజనులకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు.  దళితులు, గిరిజనులకు క్యేబినెట్ లో ప్రాధాన్యం ఇచ్చామన్నారు..  ఐటీడీఏ ప్రాంతాలక్లో గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు.  దశాబ్దాలుగా ఆదివాసులకు అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు.