హరీశ్​.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో : సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్​.. రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకో : సీఎం రేవంత్ రెడ్డి

 రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ ​రావుకు సీఎం రేవంత్​రెడ్డి తేల్చి చెప్పారు. మామ, అల్లుడు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని కేసీఆర్​, హరీశ్​రావుపై ఆయన ఫైర్​ అయ్యారు. ‘‘రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటూ నిన్నగాక మొన్న హరీశ్​రావు అన్నడు. నేను వరంగల్‍ వేదికగా మాట ఇస్తున్న. రామప్ప దేవాలయం శివుడు సాక్షిగా.. సమ్మక్కసారక్క సాక్షిగా.. వేయిస్తంభాల గుడి సాక్షిగా.. చెప్తున్న. పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుత. హరీశ్​రావు..! నువ్వు సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నవ్‍ కదా. రాజీనామా పత్రం జేబులో పెట్టుకో. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడ్త బిడ్డా. నువ్వు మాటమీద ఉండాలె” అని ఆయన సవాల్​ చేశారు. 

‘‘నీ మామలెక్క తలకాయ లేని మాటలు మాట్లాడుదాం అనుకుంటున్నవేమో. పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడ్త. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజు మాత్రమే కాదు.రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చేరోజు పంద్రాగస్టు. రెండు లక్షల రుణమాఫీచేసి నీతో మాట్లాడ్త. రాజీనామా రెడీ పెట్టుకో’’ అని హరీశ్​రావుకు తేల్చిచెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమం  టైంలో హరీశ్​రావు వంద రూపాయలు పెట్రోల్‍ తెచ్చుకున్నడు తప్పితే ఆయనకు పది పైసల అగ్గిపెట్టె దొరకలేదు. ఇప్పుడు అట్లనే చేస్తే కాంగ్రె స్‍ కార్యకర్తలంతా తలొక అగ్గిపెట్టెతో సిద్ధంగా ఉంటరు” అని సీఎం రేవంత్​రెడ్డి హెచ్చరించారు.