బిడ్డ బెయిల్ కోసం ..మోదీ దగ్గర కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు: రేవంత్

బిడ్డ బెయిల్ కోసం ..మోదీ దగ్గర కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు: రేవంత్

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ఆకలి ఇండెక్స్ లో  125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉందని.. ఇది మోదీ పాలనకు నిదర్శనమని చెప్పారు. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం లోక్  సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీకి చెప్పుకునేందుకు ఏమీ లేదని.. పదేళ్లలో మోదీ పేదలను ఆదుకున్నది లేదు.. ఇండ్లిచ్చింది లేదని విమర్శించారు.

సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్

 • బీఆర్ఎస్ అభ్యర్థి తలకాయ మోదీ దగ్గర తాకట్టు పెట్టారు.
 • బిడ్డ బెయిల్ కోసం మోదీ దగ్గర కేసీఆర్ పార్టీని తాకట్టు పెట్టారు.
 • పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన ఇళ్ల పట్టాలెన్ని.
 • మల్కాజ్ గిరి నియెజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి ఢిల్లీకి పంపించారు.
 • ఆనాడు ఈ ప్రాంతానికి ఎన్నో చేయాలనుకున్నా.. కాని బీఆర్ఎస్ సర్కార్ సహకరించలేదు.
 •  ఇప్పుడు మన సర్కార్ వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం.
 • హుజూరాబాద్ కు మోదీ నుంచి ఈటల రాజేందర్ ఎన్ని నిధులు తీసుకొచ్చారు.
 • కేసీఆర్ అవినీతిపై అమిషాతో ఈటల ఎందుకు విచారణ చేయించలే.
 • కేసీఆర్ అవినీతిపై ఈటల కేంద్రానికి ఒక్క ఫిర్యాదైనా చేశారా
 • కేసీఆర్ అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్ పై ఈటల ఎందుకు మాట్లాడుతలేడు
 •  కేసీఆర్ కు, ఈటలకు మధ్య ఉన్న ఒప్పందం ఏమిటీ?
 • మోదీ ఇచ్చిన హామీలు ఏం అమలు చేశారో ఈటల చర్చకు సిద్దమా.
 • మోదీ రైతుల ఆదాయం పెంచలేదు.. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చారు.
 • నల్ల చట్టాలపై ఢిల్లీలో రైతులు పోరాడి.. మోదీ మెడలు వంచారు.