- సీఎంతో మంత్రులు దామోదర, సురేఖ భేటీ
మెదక్, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దసరా పండగలోపే నామినేటెడ్ పోస్టులు భర్తీ కానున్నాయి. సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా ఇన్చార్జి, దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హైదరాబాద్లో సీఎంతో భేటీ అయి నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి చర్చించారు.
వివిధ సమీకరణల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఎవరిని నియమించాలనే విషయమై గంటకు పైగా చర్చించగా సీఎం ఆమోదం తెలిపారు. సుదీర్ఘ చర్చ అనంతరం ముఖ్యమంత్రి నామినేటెడ్ పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. దసరా లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేయనున్నట్లు సీఎం తెలిపారని సురేఖ పేర్కొన్నారు.