షబ్బీర్ అలీ రాజకీయ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ

షబ్బీర్ అలీ రాజకీయ ప్రస్థానంపై పుస్తకావిష్కరణ

కామారెడ్డి, వెలుగు: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 45 ఏళ్ల రాజకీయ జీవన ప్రస్థానంపై రాసిన పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌యూఐ, యువజన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో తన రాజకీయ ప్రయాణం ప్రారంభించి, కాంగ్రెస్ నేతగా, రెండు సార్లు మంత్రిగా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఆయన  రాజకీయ జీవన గాధను పుస్తకంలోప్రతిబింబింపజేశారు. 

రాజకీయ ఒడిదుడుకులు, మావోయిస్టుల బాంబు దాడి, పదవీకాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పుస్తకంలో ప్రస్తావించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్, పార్టీ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మీనాక్షి నటరాజన్  పాల్గొన్నారు.