HDFC బ్యాంక్ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

HDFC బ్యాంక్ సేవా కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

హైదరాబాద్​, వెలుగు:హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ తెలంగాణలో 12 సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది.  సామాజిక బాధ్యత (సీఎస్​ఆర్​) పథకం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల ఏటా 12 లక్షల మందికి పైగా ప్రజలు లబ్ధి పొందనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు 10 జిల్లాల్లోని 40 గ్రామాలలో అమలవుతాయి.