తెలంగాణ విపత్తు నిర్వహణ దళం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ విపత్తు నిర్వహణ దళం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం(SDRF) ని  ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా SDRF దళాన్ని శుక్రవారం లాంచ్ చేశారు. 

భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు ఎమర్జెన్సీ సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం పనిచేస్తుంది. తెలంగాణ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2వేల మంది సిబ్బందితో SDRF ఏర్పాటు కానుంది. అగ్నిమాపకశాఖలోని ఫైర్​స్టేషన్లు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు వెయ్యి మంది సిబ్బంది పనిచేస్తున్నారు.వీరితో పాటు తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగంనుంచి వెయ్యి మంది ఈ దళంలో విధులు నిర్వహిస్తారు. ఈ టీంకోసంకొత్తగా 20 బస్సులు, ట్రక్కులు, బొలేరోలతో పాటు 40 వాటర్​బోట్లు కొనుగోలు చేశారు. శుక్రవారం వీటన్నిటిని సీఎం ఆవిష్కరించారు.