వంద రోజుల పరిపాలనకు ఎన్నికలు రెఫరెండం: సీఎం రేవంత్ రెడ్డి

వంద రోజుల పరిపాలనకు ఎన్నికలు రెఫరెండం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలను గెలువాలనే పట్టుదలతో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  రంగారెడ్డి జిల్లా నుంచి  దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని ఆయన చెప్పారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనకు ఎన్నికలు రెఫరెండమని చెప్పారు. తుక్కుగూడాలో ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన జాతీయస్థాయి సభ నిర్వహిస్తామని ఆయ వెల్లడించారు. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీలు హాజరవుతారని..  ఈ సభ నుంచే జాతీయస్తాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నామని సీఎం చెప్పారు. ఈ సభను నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 బీజేపీ పాలనతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకోల్పిన అనేక సంస్థలను ప్రైవేట్ కు కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో యువతను, రైతులను మోదీ మోసం చేశారని మండిపడ్డారు. మోదీ నిర్ణయంతో ఢిల్లీ సరిహద్దులో వందల మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. దేశ ప్రజలు బాదలు తెలుసుకునేందుకు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు సీఎం.