ఆరు గ్యారంటీల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కాన్ఫరెన్స్

ఆరు గ్యారంటీల అమలుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కాన్ఫరెన్స్

హైదరాబాద్ సెక్రటేరియట్లో  కలెక్టర్లు, అడిషినల్ కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. మీటింగ్ కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ,  అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అటెండ్ అయ్యారు. మీటింగ్ లో ప్రధానంగా 6 గ్యారంటీల అమలు, ప్రజా అంశాలపై డిస్కస్ చేస్తున్నారు. పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేలా ప్రజాపాలన కార్యక్రమాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం రేవంత్. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారంటీలను అమల్లోకి తెచ్చింది కాంగ్రెస్ సర్కార్. త్వరలో మిగతా వాటి అమలు కోసం కలెక్టర్ల అభిప్రాయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి.

డిసెంబర్ 28 నుంచి వచ్చే నెల 6 వరకు ప్రజా పాలన గ్రామ సభలు నిర్వహించనుంది ప్రభుత్వం. గ్రామ సభల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ, ఏ సమస్యలు  పరిష్కారం అవుతాయనే దానిపై అధికారులతో సీఎం రేవంత్ డిస్కస్ చేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా భూ సమస్యల పరిష్కారంపై కలెక్టర్లతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్రజావాణి కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహణపై చర్చిస్తారని సమాచారం.