డిసెంబర్ 21న కలెక్టర్‌లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

డిసెంబర్ 21న కలెక్టర్‌లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు హామీల అమలుపై చర్యలు చేపట్టింది. మరోవైపు అధికారుల బదిలీలు, మరికొందరికి పోస్టింగ్స్ లతో పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలపై మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 21న జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు.

కాబట్టి ఈ సమావేశానికి కలెక్టర్‌లు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చిoచే అవకాశముందని సమాచారం. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.