మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

మాజీ డీఎస్పీ నళిని ఉద్యోగంపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

 మాజీ డీఎస్పీ  నళినికి ఆసక్తి ఉంటే ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్ 15వ తేదీ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు,  పోలీస్ శాఖపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. పారదర్యకంగా, అవకతవకలు లేకుండా పోలీస్ నియామకాలు చేపట్టాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటివరకూ చేపట్టిన పోలీస్ నియామకాలపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు రెసిడెన్షీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

తెలంగాణ కోసం నళిని తన ఉద్యోగానికి రాజీనామా చేశారని..ఆమెకు ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే.. వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. నళినికి అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి పోలీసుశాఖలో నిబంధనలు అడ్డు వస్తే.. ఇతర ఉద్యోగం ఇవ్వాలని స్పష్టం చేశారు. నళినికి అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు చెప్పారు.