కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డికి నివాళి అర్పించిన   సీఎం రేవంత్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటీరియన్ అవార్డు గ్రహీత ఎస్ జైపాల్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ లో  సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి జీవితం స్ఫూర్తి దాయకం అన్నారు. జీవితాన్ని తెలంగాణకు త్యాగం చేశారని  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర మరవలేం అన్నారు. జైపాల్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తామని రేవంత్ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ కుటుంబ సభ్యులతో  పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, GHMC కమిషనర్ ఆమ్రాపాలి, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారు.