అంధ విద్యార్థుల పాటల సీడీ ఆవిష్కరించిన సీఎం

అంధ విద్యార్థుల పాటల సీడీ ఆవిష్కరించిన సీఎం
  • సంగీత వాయిద్య పరికరాలు అందజేసిన రేవంత్​రెడ్డి 

జూబ్లీహిల్స్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో సంగీత శిక్షణ తీసుకుంటున్న అంధ విద్యార్థులకు సీఎం రేవంత్ సంగీత వాయిద్య పరికరాలను అందించారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని  సీఎం నివాసానికి వారు రాగా  ప్రతి విద్యార్థిని పలకరించారు. అనంతరం విద్యార్థిని, విద్యార్థులు సీఎం ఎదుట కొన్ని గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా అంధ విద్యార్థులు రూపొందించిన పాటల సీడీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.