పంటల మార్పిడిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ

పంటల మార్పిడిపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ
  • మరిన్ని నిర్మాణాత్మక సూచనలతో రావాలన్న సీఎం రేవంత్​ రెడ్డి 

హైదరాబాద్​, వెలుగు: సీఎం  రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పంట మార్పిడి విధానంపై లోతుగా అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను ఈ సందర్భంగా సీఎంకు  కమిషన్ అందజేసింది.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పంటల మార్పిడిపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించాలని భావిస్తోందని, అవసరమైతే శాసనసభలో దీనిపై ప్రత్యేక చర్చను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై కమిషన్ మరిన్ని నిర్మాణాత్మక సూచనలతో ముందుకు రావాలని, రైతులకు మేలు చేకూర్చేలా అధ్యయనాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.