నిమజ్జనంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు: సీఎం రేవంత్

నిమజ్జనంలో ఎలాంటి లోటుపాట్లు ఉండొద్దు: సీఎం రేవంత్

నిమజ్జన ఏర్పాట్లు, పర్యవేక్షణపై కమాండ్ కంట్రోల్ రూంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. గ్రేటర్ వ్యాప్తంగా 733 సీసీ కెమెరాలతో నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. 

ట్యాంక్ బండ్ తో పాటు.. ప్రధాన మండపాలు, చెరువుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. పర్యవక్షణతోపాటు.. ప్రతీగంటకు ఒకసారి సిబ్బందికి కమాండ్ కంట్రోల్ నుంచి సూచనలు ఇచ్చి అలెర్ట్ చేయాలని ఆదేశించారు.