రాష్ట్ర గీతంపై కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

 రాష్ట్ర గీతంపై కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర గీతంపై సెక్రటేరియట్ లో సమావేశం ప్రారంభమైంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రొఫెసర్ కోదండ రాం, ప్రముఖ తెలంగాణ  కవి అందెశ్రీ,  ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి పాల్గొన్నారు. రాష్ట్ర గీతం తుది రూపకల్పనపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకంగా అందెశ్రీ, కీరవాణితో పలుమార్లు భేటీ అయ్యారు.

కాగా, కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గీతానికి తుది మెరుగులు దిద్దుతుంది సర్కార్.  ఎం ఎం కీరవాని సంగీత సారథ్యంలో ఈ పాటను రీక్రియేట్ చేస్తున్నారు. అయితే, ఈ గీతానికి కీరవాణీ మ్యూజిక్ కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ నాయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న క్రమంలో జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కాంగ్రెస్ సర్కార్ వైభవంగా జరిపేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. జూన్ 2న జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల  చేయనున్నారు.