మే 2న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో

మే 2న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో
  • పాత బస్టాండ్ వద్ద ప్రసంగం

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట పట్టణంలో గురువారం సాయంత్రం సీఎం  రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అనంతరం పాత బస్టాండ్ చౌరస్తా వద్ద ప్రసంగించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చి కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిపాడ్ దిగిన తర్వాత బీజేఆర్ చౌరస్తా నుంచి దాదాపు మూడు కిలో మీటర్ల మేర సీఎం రోడ్ షో ను నిర్వహించనున్నారు.

సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటి సారి సీఎం రేవంత్​ సిద్దిపేట జిల్లాలో వస్తుండడంతో భారీగా స్వాగత ఏర్పాట్ల కు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. సిద్దిపేట మున్సిపాల్టీ పరిధిలోని 43 వార్డుల నేతలతో నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణతోపాటు కాంగ్రెస్​ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షో పట్టణంలోని అన్ని వార్డుల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేయడానికి దిశా నిర్దేశం చేశారు.