భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌‌ : సీఎం రేవంత్

భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్‌‌ : సీఎం రేవంత్
  •    సినీ రంగానికి అవసరమైన చేయూతను అందిస్త: సీఎం రేవంత్ ​
  •     జాతీయ ఫిల్మ్ అవార్డ్స్​ గ్రహీత‌‌ల‌‌కు స‌‌న్మానం

హైదరాబాద్, వెలుగు: భారతీయ సినిమా నిర్మాణానికి హైదరాబాద్‌‌ను ప్రధాన కేంద్రంగా నిలపాలని సీఎం  రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగానికి అవసరమైన చేయూతను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న తెలుగు సినీ ప్రముఖులు సోమవారం సీఎం రేవంత్​ రెడ్డిని జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.  సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సీఎం దృష్టికి సినీ ప్రముఖులు తీసుకొచ్చారు.

అనంత‌‌రం అవార్డు గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్నవాళ్లలో ‘భగవంత్ కేసరి’ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి, ‘హను–-మాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఆ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డు గ్రహీతలైన వెంకట్, శ్రీనివాస్  అండ్​ టీమ్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, ‘బేబీ’ సినిమా దర్శకుడు సాయి రాజేశ్‌‌, గాయకుడు రోహిత్ ఉన్నారు.