జయశంకర్ సార్ తెలంగాణకు జీవితాన్ని అంకితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

జయశంకర్ సార్ తెలంగాణకు జీవితాన్ని అంకితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
  • నేడు జయంతి సందర్భంగా సేవలు కొనియాడిన సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్.. తన జీవితాన్ని అంకితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సార్ జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం స్మరించుకున్నారు. తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్​ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని తెలిపారు. స్వరాష్ట్ర కలల జెండాను, భవిష్యత్ ఎజెండాను ఆయన వదిలిపెట్టలేదన్నారు. తెలంగాణే శ్వాసగా.. ధ్యాసగా.. లక్ష్యంగా  బతికి, కోట్లాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారని కొనియాడారు. ఆయన ఓ గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు.

గద్దర్ సేవలను స్మరించుకున్న సీఎం

ప్రజా గాయకుడు గద్దర్ సేవలు మరువలేమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారని కొనియాడారు. బుధవారం గద్దర్ వర్ధంతి సందర్భంగా ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని సీఎం రేవంత్ గుర్తుచేసుకున్నారు. గద్దర్ సాంస్కృతిక, సాహితీ సేవలకు గుర్తింపుగా జూన్ 14న ఆయన పేరు మీద తెలంగాణ ఫిల్మ్ అవార్డులను సినీ కళాకారులు, ప్రముఖులకు అందించామని తెలిపారు.