ఇంద్రవెల్లి నా సెంటిమెంట్.. ఫిబ్రవరి 2న భారీ బహిరంగ సభ: సీఎం రేవంత్

ఇంద్రవెల్లి నా సెంటిమెంట్.. ఫిబ్రవరి 2న భారీ బహిరంగ సభ: సీఎం రేవంత్

పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  హైదరాబాద్ గాంధీభవన్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల మీటింగ్ జరిగింది. సమావేశానికి స్టేట్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ముఖ్య నేతలంతా అటెండయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. పార్లమెంట్ ఎన్నికలు ఇంకో 60 రోజుల్లో జరిగే అవకాశాలున్నాయని చెప్పారు.ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2 నుంచి సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు రేవంత్. తాను పీసీసీ చీఫ్ అయ్యాక 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర సభ నిర్వహించారు. అదే సెంటిమెంట్ తో ఇపుడు లోక్ సభ ఎన్నికల ప్రచారం ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు రేవంత్. 

ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామని.... నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించి ముందుకుపోవాలని సూచించారు సీఎం రేవంత్.  ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు.రాజ్యసభ ఎన్నిలకు అభ్యర్థుల ఎంపిక  అధిష్టానం చూసుకుంటదన్నారు.  రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు రేవంత్. మార్చి 3 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఓసీలు అప్లికేషన్ రూ. 50 వేలు,  ఎస్సీ,ఎస్టీ,అభ్యర్థులు రూ.25 వేలు చెల్లించాలని చెప్పారు.