IPL 2026: RRకు శాంసన్ గుడ్ బై.. పరాగ్‌కు నో ఛాన్స్.. రాజస్థాన్ కెప్టెన్సీ రేస్‌లో మరో వికెట్ కీపర్

IPL 2026: RRకు శాంసన్ గుడ్ బై.. పరాగ్‌కు నో ఛాన్స్.. రాజస్థాన్ కెప్టెన్సీ రేస్‌లో మరో వికెట్ కీపర్

డిసెంబర్ 15న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ  మినీ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి నుంచే ప్రాంఛైజీలు తమ ప్లేయర్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై ఫోకస్ పెట్టాయి. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైన్ పై ఒక ఒక అంచనాకు వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ ఏకంగా తమ కెప్టెన్ సంజు శాంసన్ ట్రేడింగ్ ద్వారా రిలీజ్ చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ట్రేడింగ్ ద్వారా సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ చేరనున్నట్టు దాదాపు కన్ఫర్మ్ అయింది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. శాంసన్ లేకపోతే రాజస్థాన్ కెప్టెన్ అనే ప్రశ్న తెలెత్తుతుంది. రాజస్థాన్ కెప్టెన్సీ రేస్ లో ఇప్పుడు ముగ్గురున్నారు.   

రియాన్ పరాగ్:

సంజు శాంసన్ లేకపోవడంతో రాజస్థాన్ జట్టు పగ్గాలు రియాన్ పరాగ్ కు అప్పగించే అవకాశాలు లేకపోలేదు. గతే సీజన్ లో శాంసన్ గాయపడినప్పుడు అతని గైర్హాజరీలో పరాగ్ రాజస్థాన్ జట్టును నడిపించాడు. పరాగ్ 8 మ్యాచ్ ల్లో కెప్టెన్సీ చేస్తే రెండు మ్యాచ్ ల్లో మాత్రమే జట్టు విజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్ లో కెప్టెన్సీ రేస్ లో ఉన్నపటికీ అతని బ్యాడ్ ట్రాక్ రికార్డ్ తో  రాజస్థాన్ పరాగ్ కు సారధ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తక్కువ వయసు కావడంతో కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్ మీద పడకూదడదని యాజమాన్యం భావిస్తున్నట్టు సమాచారం. 

యశస్వి జైస్వాల్: 

రాజస్థాన్ జట్టులో యశస్వి జైశ్వాల్ టీమిండియా స్టార్ ప్లేయర్. అతను రాజస్థాన్ జట్టుకు భవిష్యత్ కూడా. జైశ్వాల్ కూడా కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు జైశ్వాల్ కు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. ఐపీఎల్ లాంటి బిగ్ టోర్నీల్లో ఒత్తిడి తట్టుకొని జట్టును ముందుకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. జైశ్వాల్ కు కెప్టెన్సీ అప్పగిస్తే ఆ ప్రభావం తన బ్యాటింగ్ పై పడొచ్చు. దీంతో జైశ్వాల్ రేస్ లో ఉన్నప్పటికీ అనుభవం లేకపోవడంతో అతనికి ఇంత పెద్ద బాధ్యతలు అప్పగించే అవకావం లేనట్టు అర్ధమవుతోంది. 2020లో అరంగేట్రం చేసినప్పటి నుండి.. జైస్వాల్ రాజస్థాన్ తరపున 34.38 యావరేజ్.. 152.85 స్ట్రైక్ రేట్‌తో 2166 పరుగులు చేశాడు.

ALSO READ :  ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్రేడింగ్

ధ్రువ్ జురెల్ కు రాజస్థాన్ పగ్గాలు: 

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఆటగాడు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్. రూ. 20 లక్షలతో రాజస్థాన్ జట్టులోకి వచ్చిన జురెల్.. గత సీజన్ లో మెగా ఆక్షన్ కు ముందు ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ను రాజస్థాన్ రూ.14 కోట్లకు రిటైన్ చేసుకుంది. తన ధరకు న్యాయం చేస్తూ జురెల్ ఐపీఎల్ 2025 సీజన్ లో అద్భుతంగా రాణించాడు.156.34 స్ట్రైక్ రేట్ తో 333 పరుగులు చేశాడు.అన్నిటికి మించి జురెల్ కు కెప్టెన్సీ అనుభవం ఉంది. 2020 ప్రపంచ కప్‌లో భారత అండర్-19 జట్టుకు జురెల్ వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. 

అంతేకాదు జురెల్ ఉత్తర ప్రదేశ్ టీ20 లీగ్ ఫ్రాంచైజీ గోరఖ్‌పూర్ లయన్స్‌కు కూడా కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఇండియా A వైస్-కెప్టెన్‌గా.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న జురెల్.. వికెట్ కీపింగ్ అద్భుతంగా చేయగలడు. వికెట్ కీపర్ కావడంతో రాజస్థాన్ జట్టు జురెల్ ను కెప్టెన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.