ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే: సీఎం రేవంత్రెడ్డి

ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే: సీఎం రేవంత్రెడ్డి

ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్  ఇచ్చారు.  డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు గ్రామసభలు నిర్వాహిస్తామని తెలిపారు. ప్రతి నాలుగు నెలలకు ఓసారి గ్రామసభలపై సమీక్షలు ఉంటాయి..ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్ తో ఉంది.. అధికారులు ఇచ్చే సలహాలు కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందన్నారు. ఎష్ ఆర్ శంకరన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలని కోరారు. 

మాది ఫ్రెండ్ల ప్రభుత్వం ప్రజల చేత ఫ్రెండ్లీగా  ఉన్నంత వరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. ప్రజల మనసును గెలిచి మంచి పేరును తెచ్చుకోవాలని సూచించారు.

అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా పనిచేయగలను అన్న ఆలోచనలో ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ డీఎన్ ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.