విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని చెప్పారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని తెలిపారు. ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సెక్రటేరియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ఆకునూరి  మురళి వంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యావ్యవస్థలో లోపాలను వారు సమావేశంలో ప్రస్తావించారు. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు సీఎం రేవంత్. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీల్లో విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు చెప్పారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని తెలిపారు. విద్యా, వ్యవసాయ రంగాల సమస్యల పరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు సీఎం. విద్యా కమిషన్ ద్వారా సమస్యలు పరిష్కామని చెప్పారు.