తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు: సీఎం రేవంత్

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు: సీఎం రేవంత్

ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  రాష్ట్ర అవతరన దినోత్సవం సందర్బంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరించారు  రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల పేరుమీదే  ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నామన్నారు.  మహిళకు ఫ్రీ బస్ జర్నీ కల్పించామని చెప్పారు. తెలంగాణ మహిళా శక్తి  చాటి చెప్తున్నామన్నారు. రుద్రమదేవి,చాకలి ఐలమ్మ,మల్లుస్వరాజ్యం ఆదర్శంగా తీసుకున్నామని తెలిపారు. మహిళలకు 21వేల కోట్ల జీరో వడ్డీ రుణాలు ఇచ్చామని వెల్లడించారు రేవంత్. 

రేవంత్ కామెంట్స్ 

  • 60 ఏళ్ల ఆకాంక్షను సోనియా గౌరవించారు
  •  సకలజనులు ఉద్యమించి సాధించుకున్న రోజు
  • 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు
  • దశాబ్దాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం
  • రాష్ట్రం వచ్చి పదేళ్లు అయినా  ఆకాంక్షలు నెరవెరలేదు
  • పదేళ్ల ఆదిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని  తెచ్చకున్నారు
  • రాష్ట్రాన్ని పునర్నిర్మించే  దిశగా అడుగులు వేస్తున్నాం
  • మేం అధికారంలోకి వచ్చే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్థంగా ఉన్నాయి
  • విద్యా, వ్యవసాయ కమిషన్ ను నియమించుకున్నాం
  • కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
  • ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం
  • మహిళకు ఫ్రీ బస్ జర్నీ కల్పించాం
  • తెలంగాణ మహిళా శక్తి  చాటి చెప్తున్నాం
  • రుద్రమదేవి,చాకలి ఐలమ్మ,మల్లుస్వరాజ్యం ఆదర్శం
  •   మహిళలకు 21వేల కోట్ల వడ్డీలేని రుణాలు  ఇచ్చాం
  • మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం
  • మహిళా సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు
  • ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను  చేశాం
  • రూ.500 గ్యాస్, 200 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం
  • రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశాం
  •  గతంలో ధరణి కొద్దిమందికే  చుట్టం అయితే..భూ భారత  ప్రజలకు  రక్షణ చట్టం
  • భూ భారతితో రైతులు సమస్యలు తీరుస్తున్నాం
  •  ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణాలు మాఫీ చేశాం
  • సివిల్ అభ్యర్థులకు ఆర్థికసాయం అందిస్తున్నాం
  • ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ  నెంబర్ వన్
  •  ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టాం
  • పెట్టుబడి ద్వారా లక్షమందికి ఉపాధి కల్పించాం
  •  క్రీడాకారులను ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా  స్పోర్ట్స్ యూనివర్శిటీ
  • ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నాం
  • ఒలింపిక్స్ లో భారత్ కు ఒక్క గోల్డ్ మెడల్ లేకపోవడం బాధాకరం
  • ఒలింపిక్స్ లో సత్తా చాటేలా క్రీడాకారులను తయారు చేస్తాం
  • 2028లో ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తాచాటేలా కృషి చేస్తాం
  •  రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం
  • బలహీన వర్గాలకు అండగా కులగణన
  • తెలంగాణ మార్గదర్శకాలకు అనుగుణంగానే కులగణన
  • వందేళ్ల తర్వాత కులగణన చేశాం
  • కులగణనలో దేశానికే తెలంగాణ ఆదర్శం
  • విద్యపై పెట్టుబడి అంటే భావి భారత నిర్మాణమే