ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పలువురు నాయకులు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణ అంశాలపై హైకమాండ్ దే తుది నిర్ణయమని, మంత్రి వర్గ విస్తరణ AICC పెద్దల పరిశీలనలో ఉందని అన్నారు. పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై మీడియాలోనే విస్తృతంగా ప్రచారం జరుగుతోందని అన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ అధ్యాయం ముగిసిందని, ఆ పార్టీది గతమేనని, భవిష్యత్ లేదని అన్నారు. బీఆర్ఎస్ ను టార్చిలైట్ వేసి వెతకాల్సిన పరిస్థితి ఉందన్నారు. కొత్త పీసీసీని నియమించాలని అధిష్టాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. కేబినెట్ విస్తరణపై మీడియాలో వస్తున్న అవాస్తవాలు సీఎం ఖండించారు. మీడియానే కేబినెట్ ను విస్తరించింది.. వాయిదా వేసిందని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధాని, హోం మినిస్టర్ తో చర్చించామని ఆయన అన్నారు.
