
బీసీ రిజర్వేషన్ల కోసం ఎంత వరకైనా పోరాడుతామన్నారు సీఎం రేవంత్. బీసీ బిల్లుకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మాజీ సీఎం కేసీఆర్ 2018లో చట్టం తెచ్చారని.. ఆ చట్టాన్ని తొలగించడానికే తాము ఆర్డినెన్స్ తెచ్చామన్నారు రేవంత్. సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహానికి శంకుస్థాపన చేసిన సీఎం..అనంతరం రవీంద్ర భారతిలో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు..
ఈ సందర్బంగా మాట్లాడిన రేవంత్.. ఆరు నెలలుగా బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలంటే చట్టం అడ్డంగికిగా ఉందని చెప్పారు.. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీలో ధర్నా చేశామన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నేతలు మొండి వాడన చేస్తున్నారని ఫైర్ అయ్యారు సీఎం. తెలంగాణలో 56.33 శాతం వెనుకబబడిన వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్. బలహీన వర్గాల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. మత ప్రాతిపాదికన రిజర్వేషన్లకు తావు లేదన్నారు రేవంత్. బీసీలు కూడా రాజ్యాధికారంలో భాగం కావాలన్నారు. తాము చేసిన బిల్లులో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటే చూపించాలన్నారు సీఎం.
సర్దార్ సర్వాయి పాపన్న గొప్ప పోరాట యోధుడన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి..అది ఈ రోజు నెరవేరబోతుంది. పాపన్న విగ్రహం తెలంగాణ సామ్రాజ్యానికి స్ఫూర్తిగా ఉండబోతోంది. . ఆనాడే బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించిన యోధుడని చెప్పారు. ఖిలా షాపూర్ కోటను గత ప్రభుత్వం మైనింగ్ లీజుకు ఇచ్చిందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఖిలా షాపూర్ కోట పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
►ALSO READ | రామంతాపూర్ ఘటన..న్యాయం చేయాలంటూ ఆందోళనలు..రోడ్డుపై బైఠాయించిన బాధితులు
ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉండాలని సోనియా గాంధీ ప్రధాన మంత్రి పదవిని త్యాగం చేశారని చెప్పారు సీఎం రేవంత్ . భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడానికి గాంధీ కుటుంబం కారణమని అన్నారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనం అని అన్నారు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు రేవంత్. ఎన్నో అడ్డంకులు వచ్చినా కులగణన చేసి చూపించాం. తాము చేసిన పనిలో తప్పు ఉంటే చేసి చూపించమని చెప్పామన్నారు. ఎన్నో సార్లు మేదావులతో సమావేశమై చర్చించిన తర్వా కులగణన చేశామన్నారు.