రామంతాపూర్ ఘటన..న్యాయం చేయాలంటూ ఆందోళనలు..రోడ్డుపై బైఠాయించిన బాధితులు

రామంతాపూర్ ఘటన..న్యాయం చేయాలంటూ ఆందోళనలు..రోడ్డుపై బైఠాయించిన బాధితులు

రామంతాపూర్ విద్యుత్ షాక్ ఘటనలో బాధిత కుటుంబాలు రోడ్డెక్కాయి. సోమవారం (ఆగస్టు18) తమకు న్యాయం చేయాలంటూ రామంతాపూర్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాధితులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బాధితులకు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు. 

అంతకుముందు సంఘటనా స్థలానికి వచ్చిన విద్యుత్ శాఖ సీఎండీని స్థానికులు అడ్డుకున్నారు.  విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి కదిలేది లేదు అని సీఎండీని నిలదీశారు.  డిప్యూటీ సీఎంతో మాట్లాడి చనిపోయినవారికి, గాయపడ్డ వారికి నష్టపరిహారం అందేలా చూస్తానని స్థానికులు హామి ఇచ్చారు సీఎండీ. 

►ALSO READ | రామంతాపూర్ బాధిత కుటుంబాలకు..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

సోమవారం తెల్లవారుజామున జరిగిన అనుకోని ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్పాట్ లో ఐదుగురు చనిపోయారు. మరొకరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 

అనుకోని ఘటనకు రామంతాపూర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. పెద్ద ఎత్తున్ ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యుత్ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధిత  కుటుంబాల బాధ చెప్పనలవికాదు. మృతుల కుటుంబ సభ్యులతో రోదనలతో రామంతాపూర్ మార్మోగింది. ఊహించని ఘటనకు రామంతాపూర్ ప్రజలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.