సమ్మక్క సారలమ్మ జాతర అంటే అందరికీ మేడారం జాతర గుర్తొస్తుంది. కానీ మంచిర్యాల జిల్లాలో కూడా సమ్మక్క సారక్క జాతర జరుగుతుంటుంది. చెన్నూరు మండలంలోని అక్కేపల్లి గ్రామ సమీపంలో ప్రతి ఏడాది జాతర నిర్వహిస్తుంటారు. గురువారం (జనవరి 29) అక్కేపల్లి సమ్మక్క సారక్క జాతరలో పాల్గొన్నారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
మంత్రి వివేక్ ను బాజా భజంత్రీలతో ఘనంగా స్వాగతించారు ఆలయ కమిటీ నిర్వాహకులు. సమ్మక్క సారక్క గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి . సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
