
నాగర్ కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఊరు అయిన కొండారెడ్డిపల్లిలో కుటుంబ సమేతంగా దసరా వేడుకలు జరుపుకున్నారు. సొంతూరు వెళ్లిన సీఎంకు కొండారెడ్డి పల్లిలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ను గజమాలతో సత్కరించారు. ఆంజనేయస్వామి టెంపుల్లో సీఎం పూజలు చేశారు. కోట మైసమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. జమ్మి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు.