ఆదివారం ( డిసెంబర్ 14 ) ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఓట్ చోరీ-గద్ది ఛోడ్ పేరుతో మహాధర్నా నిర్వహించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ క్రమంలో సభను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. ప్రధాని మోడీ సర్కార్ రాజ్యాంగాన్ని అవమానిస్తోందని అన్నారు. ఓట్ల చోరీ కాంగ్రెస్ సమస్య కాదని.. దేశ ప్రజల సమస్య అని అన్నారు సీఎం రేవంత్.
బీజేపీ, ఈసీ వోట్ చోరీపై రాహుల్ గాంధీ అన్ని ఆధారాలు బయటపెట్టారని.. ఇప్పుడు వోట్ చోరీ చేస్తున్నారు, తర్వాత భూమి, రేషన్ కార్డు కూడా తీసేస్తారని అన్నారు సీఎం రేవంత్. దళిత, ఆదివాసీ హక్కులను బీజేపీ దోచుకుంటోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తోందని అన్నారు సీఎం రేవంత్.
ఓట్ చోరీపై పోరాటంలో అంతా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని అన్నారు సీఎం రేవంత్. SIR పేరుతో అన్యాయంగా ఓట్లు తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు సీఎం రేవంత్. గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్లాన్ చేసిందని అన్నారు సీఎం రేవంత్.
