క్యాన్సర్ బాధితుడికి అండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీఎం రేవంత్ రెడ్డి

క్యాన్సర్ బాధితుడికి అండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సీఎం రేవంత్ రెడ్డి
  • చికిత్సకు రూ.12 ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షలు అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ బారిన పడ్డ సిరిసిల్ల సాయిచరణ్ చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి సీఎం రేవంత్ రెడ్డి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. చికిత్స చేయించుకున్న సాయిచరణ్, తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాష్ట్ర సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 

ధైర్యంగా ఉండాలని సాయిచరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సీఎం సూచించారు. సాయిచరణ్ అక్యూట్ మైలాయిడ్ లుకేమియా (బ్లడ్ క్యాన్సర్)తో బాధపడుతున్నారు. ఆయనకు భార్య లక్ష్మిప్రసన్న, ఇద్దరు కుమార్తెలు లక్ష్మి సుసజ్ఞ , స్మయ (2 నెలలు), తల్లిదండ్రులు రాము, సునీత ఉన్నారు.