డీకేకు సీఎం రేవంత్‌‌‌‌ థ్యాంక్స్‌‌‌‌ ..జూరాలకు నీటి విడుదలపై ‘ఎక్స్‌‌‌‌’లో ట్వీట్‌‌‌‌ 

డీకేకు సీఎం రేవంత్‌‌‌‌ థ్యాంక్స్‌‌‌‌ ..జూరాలకు నీటి విడుదలపై ‘ఎక్స్‌‌‌‌’లో ట్వీట్‌‌‌‌ 
  • రెండు రాష్ట్రాల మధ్య స్నేహభావానికి 
  • ఇదొక గొప్ప ఉదాహరణ అని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు కృష్ణా జలాలను విడుదల చేయాలన్న విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కర్నాటక సీఎం డీకే శివకుమార్‌‌‌‌కు సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ‘ఎక్స్‌‌‌‌’ వేదికగా రేవంత్‌‌‌‌రెడ్డి స్పందించారు. తమ విజ్ఞప్తిని మన్నించి నీటిని విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతునట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న స్నేహభావానికి ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. దేశంలోని ప్రజల మధ్య ఉన్న ప్రేమ, సోదరభావాన్ని ఈ పరిణామం చాటి చెబుతోందని తెలిపారు.