కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్ జేఎన్టీయూ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను శుక్రవారం ఘనంగా నిర్వహించడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీ ఉత్సవాలను సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ప్రొఫెసర్ టి. కిషన్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు వర్సిటీ ప్రాంగణంలోని జేఎన్ టీయూఆడిటోరియంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
