ఇవాళ (మే 8న) హైడ్రా పోలీస్ స్టేషన్ ​ఓపెనింగ్

ఇవాళ (మే 8న) హైడ్రా పోలీస్ స్టేషన్ ​ఓపెనింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: బుద్ధభవన్​లోని హైడ్రా ఆఫీస్​పక్కనే ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్​స్టేషన్​ను గురువారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ తోపాటు ఫస్ట్, సెకండ్​ఫ్లోర్లలో10,500 చ‌‌ద‌‌ర‌‌పు అడుగుల విస్తీర్ణంలో హైడ్రా పీఎస్​ను ఏర్పాటు చేశారు. ఎస్‌‌హెచ్‌‌ఓగా ఏసీపీ పి.తిరుమ‌‌ల్ నియ‌‌మితుల‌‌య్యారు. ఆరుగురు ఇన్‌‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుల్స్ ను కేటాయించారు.

ఇక నుంచి ప్రభుత్వ భూములు, ప్రజావ‌‌స‌‌రాల‌‌కు ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, ర‌‌హ‌‌దారులు, చెరువులు, నాలాల‌‌ను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీసు స్టేష‌‌న్ లో క్రిమిన‌‌ల్ కేసులు న‌‌మోదు చేసి విచార‌‌ణ చేప‌‌ట్టనున్నారు. అవసరమైతే అరెస్టులు చేయనున్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల‌‌లో మ‌‌ట్టి పోసిన వారిపై కేసులు బుక్ చేయనున్నారు.  

న‌‌కిలీ ప‌‌త్రాలు సృష్టించి లే ఔట్లను మాయం చేసిన వారిని, ప్రభుత్వ భూములను కాజేయాల‌‌నుకునే వారిపై సీరియస్​యాక్షన్​తీసుకోనున్నారు. వాల్టా, ఫైర్ యాక్టుల ఉలంఘ‌‌నులను నేరుగా హైడ్రా పీఎస్​కు తీసుకొచ్చి విచారించి శిక్షలు అమ‌‌లు చేయనున్నారు. ఇప్పటికే ఆక్రమ‌‌ణ‌‌ల‌‌కు సంబంధించి ఆయా పోలీసు స్టేష‌‌న్లలో 50కి పైగా కేసులు విచార‌‌ణ‌‌లో ఉన్నాయి. అవన్నీ హైడ్రా పోలీస్​స్టేష‌‌న్‌‌కు బ‌‌దిలీ కానున్నాయి.