ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీస్

ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీస్

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. 2025, జనవరి 8వ తేదీ ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. 

ఈ క్రమంలోనే కొండల్ రెడ్డికి నోటీసులు పంపిన సిట్ సాక్షిగా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. కొండల్ రెడ్డితో పాటు ఈ కేసులో మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యకు కూడా సిట్ నోటీసులు పంపించింది. గురువారం (జనవరి 8) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో  జైపాల్ యాదవ్, చిరుమూర్తిని సిట్ ఇప్పటికే ఓ సారి విచారించింది. 

►ALSO READ | వరంగల్ చౌరస్తాలో కత్తితో మహిళ హల్ చల్.. భర్త వివాహేతర సంబంధ పెట్టుకున్నాడని రచ్చరచ్చ !