- గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మాణానికి భూమిపూజ
- ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కొడంగల్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 24న కొడంగల్‌లో పర్యటించనున్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కొడంగల్ శివారులోని ఎన్కేపల్లిలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్‌కు సీఎం భూమి పూజ చేయనున్నారు.
అలాగే దుద్యాల మండలం హకీంపేటలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్కారిడార్, ఎడ్యకేషనల్హబ్ను పరిశీలిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ప్రతీక్జైన్, ఎస్పీ నారాయణరెడ్డి కలిసి గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తుపై చర్చించారు. అసిస్టెంట్ కలెక్టర్హర్ష్చౌదరి, కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు.
