
- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి పరామర్శ
వరంగల్/నర్సంపేట, వెలుగు: హన్మకొండకు బుధవారం సీఎం రేవంతరెడ్డి రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటనకు సంబంధించిన సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి అందింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ ఈ నెల 4న చనిపోగా, ఆమె దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో రానున్నారు.
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వడ్డేపల్లి పీజీఆర్ గార్డెన్‌కు వెళ్లి దొంతి కాంతమ్మకు నివాళులర్పించి, ఎమ్మెల్యేతో పాటు ఆయన ఫ్యామిలీని పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు. మంగళవారం వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.