ఆ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

ఆ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : పాఠశాలలు రీఓపెన్​ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో విద్యార్థినులు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ చేయడంపై సీఎం రేవంత్​రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

 సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మగ్దుంపూర్ పాఠశాలలో చదువుతున్న బాలికలు.. “ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం వల్ల తాము ఫ్రీగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం’’ అంటూ తమ ఆధార్ కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్న ఫొటోలను శుక్రవారం ఓ జర్నలిస్టు సీఎం రేవంత్​రెడ్డికి పంపించగా ఆయన దానిని ఎక్స్​లో పోస్ట్​చేశారు. ‘‘ఆ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు”అని సీఎం రేవంత్​ పేర్కొన్నారు.