
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న గద్దర్ కాంస్య విగ్రహ పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. గద్దర్గళం బృందం సోమవారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి.. త్వరలో కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న గద్దర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ స్ఫూర్తిని సజీవం చేస్తున్నందుకు గద్దర్ గళం బృందాన్ని అభినందించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ పోషించిన పాత్ర మరవలేనిదని గుర్తు చేశారు.
రేపటి తరాలకు గద్దర్ ప్రాముఖ్యతను తెలియజేసేలా కృషిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా గద్దర్ గళం ఫౌండర్ ప్రెసిడెంట్ కొల్లూరి సత్తయ్య సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, కరీంనగర్ గద్దర్ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ గజ్జెల స్వామి, తదితరులు పాల్గొన్నారు.