రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విషెష్

రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విషెష్

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి సహకరంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నా మన్నారు, ఇనుప కంచెలను తొలగంచాం.. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశామని చెప్పారు. ప్రజాస్వామ్య పునరుదధరణ, పౌరులకు స్వాచ్ఛ ఉంటుందని హామీని నిలబెట్టుకున్నామన్నారు సీఎం. 

ఆరింటిలో రెండు గ్యారెంటీలు అమలు చేశామన్నారు సీఎం. కొత్త ఏడాదిలో మిగతా గ్యారెంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామనిచెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలని ఆకాంక్షించారు.. యువత తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతమని చెప్పారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి... వారి భవిష్యత్ కు గ్యారంటీనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు సమూల ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

ఈనూతన సంవత్సరం రైతు, మహిళా,యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామన్నారు. గతపాలనలో స్తంభించిన పాలన వ్యవస్థసమూల ప్రక్షాళనకు సంక్పలించామని చెప్పారు.ప్రజా పాలనకు అనుగుణంగా వ్యవస్థల పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజల బాధలు వినేందుకు ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థలో మానవీయత జోడించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిస్థితిని పరిపుష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు సీఎం.. ఆర్థిక, విద్యుత్రంగాలలో కాస్త పరిస్థితులను శ్వేతపత్రాల ద్వారా మీ ముందు ఉంచుతామనిచెప్పారు. త్వరలో సాగునీటి రంగంలో అవినీతిపైకూడా శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు.

పింఛన్లు, రేషన్ కార్డుల కోసం లక్షల మంది ఎదరుచూశారని..త్వరలో వాళ్ల కలసాకారం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరికి సంక్షేమఫలాలు అందిస్తామని చెప్పారు. అధికారం కోల్పోయామనే ఈర్ష్యతో కొంత మందితప్పుడుప్రచారంచేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఆటో, అసంఘటితకార్మికులకు 5లక్షల ప్రమాద బీమా అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.