మెస్సీకి సీఎం రేవంత్ అల్విదా..‘ఎక్స్’లో భావోద్వేగంతో పోస్టు

మెస్సీకి సీఎం రేవంత్ అల్విదా..‘ఎక్స్’లో భావోద్వేగంతో పోస్టు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫుట్‌‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వీడ్కోలు పలుకుతూ భావోద్వేగ సందేశాన్ని ‘ఎక్స్’ లో షేర్​చేశారు. ప్రపంచ ఫుట్‌‌బాల్ క్రీడాభిమానులందరినీ తన అద్భుతమైన ఆటతీరుతో మంత్రముగ్ధులను చేసిన మెస్సీకి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హైదరాబాద్‌‌లో ఫుట్‌‌బాల్ మైదానంలో మెస్సీతో గడిపిన కొద్ది నిమిషాలు తన జీవితంలో మరువలేని గొప్ప అనుభూతి అని, ఆ క్షణాలను పంచుకోవడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఫుట్‌‌బాల్ చరిత్రలో ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) అయిన మెస్సీ లేని ఫుట్‌‌బాల్ లోకం ఇకపై ఎప్పటికీ ఒకేలా ఉండదని అభివర్ణించారు. దిగ్గజ క్రీడాకారుడిగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలుకుతూ, భవిష్యత్తులోనూ యువతను స్ఫూర్తినిస్తూనే ఉండాలని ఆకాంక్షించారు.