వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు అంతర్జాతీయ ఎయిర్ పోర్టును నిర్మిస్తామని హామీనిచ్చారు. హైదరాబాద్ తోపాటు వరంగల్ ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సాయంత్రం హన్మకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కడియం శ్రీహరి దగ్గర కోట్ల రూపాయలు చూసి ఎంపీ టికెట్ ఇవ్వలేదు.. ఆయన నిజాయితీని చూసి ఇచ్చామన్నారు. మీ బిడ్డ కడియం కావ్యను ఆశీర్వదించి..  భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి పాయింట్స్

 • రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కృషి చేస్తోంది.
 • వరంగల్ పట్టణాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తాం
 • వరంగల్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తాం
 • కాకతీయ యూనివర్సీటీని ప్రక్షాళన చేస్తాం
 • యూనివర్సీటీకి త్వరలోనే కొత్త వైస్ చాన్సలర్ ను నియమిస్తాం
 • వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ ను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తాం
 • కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి.
 • కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రమ్మంటే.. పారిపోతుండు
 • దమ్ముంటే కేసీఆర్ కాళేశ్వరంపై చర్చకు రావాలి
 • మేం కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో.. కాళేశ్వరం ఎలా ఉందో చర్చిద్దాం
 • మామా అల్లుళ్లు తోక తెగిన  బల్లుల్లా ఎగిసిపడుతున్నారు
 • మోడీ, కేసీఆర్ నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వారు
 •  ఇద్దరు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు.
 • కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారు
 • మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ.
 • మోదీ యువతతోపాటు రైతులను మోసం చేశాడు
 • నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూశాడు.
 • దేశ సరిహద్దు్లో రైతులు పోరాటం చేసి మోదీ మెడలు వంచారు
 • రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేదు
 • కాజీపేటకు సోనియా కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే.. మోదీ మహారాష్ట్రకు తరలించుకుపోయాడు
 • మోదీ దేన్నీ వదలలేదు.. అన్నింటిపై పన్నులు వేశారు.
 • బీజేపీ వాళ్లకు మత పిచ్చి పట్టుకుంది
 • అభివృద్ధిపై మాట్లాడకుండా బీజేపీ వాళ్లు.. మత చిచ్చు పెట్టి మూడోసారి గెలవాలని చూస్తున్నారు
 • వరంగల్ లో రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవాలి