ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్

సీఎం రేవంత్​ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో.. అందులో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వెళ్తారు. అసెంబ్లీ సెషన్ నడుస్తుండడంతో.. గురువారం ఉదయం సభకు వచ్చి.. ఆ తర్వాత మధ్యాహ్నం స్పెషల్ ఫ్లైట్​లో ఢిల్లీకి బయల్దేరి వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 సీఎం రేవంత్​ రెడ్డితో పాటు సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజనర్సింహ, స్పెషల్ ఇన్వైటీ అయిన వంశీచంద్ రెడ్డి కూడా సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్​లో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో.. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తున్నది. ఏపీ నుంచి రఘువీరా రెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బరామి రెడ్డి పాల్గొంటారు.