2047 నాటికి భారత ముఖచిత్రం మార్చే.. గేమ్ ఛేంజర్ లో తెలంగాణ కీ రోల్

2047 నాటికి భారత ముఖచిత్రం మార్చే.. గేమ్ ఛేంజర్ లో తెలంగాణ కీ రోల్

తెలంగాణ రైజింగ్ 2047 రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ఆయన..2047 నాటికి భారత ముఖచిత్రం మార్చే గేమ్ చేంజర్ తో తెలంగాణ కీ రోల్ పోషిస్తుందన్నారు.

హైదరాబద్ సిటీ మన బలం మన బ్రాండ్ అన్న రేవంత్...  2035 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమియే టార్గెట్ అని చెప్పారు . లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్  కేరాఫ్ గా మారిందన్నారు.   గ్లోబల్  కెపబులిటీ సెంటర్ల  హబ్ గా హైదరాబాద్ తీర్చిదిద్దామన్నారు. కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన 904టీఎంసీల వాటా సాధిస్తామన్న రేవంత్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

రేవంత్ కీలక  అంశాలు 

  • సామాన్యుడు సాయుధ పోరాటంతోనే  విజయం సాధించాడు.
  • సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చింది
  •  రాచరికానికి ఘోరీ కట్టిన రోజే  సెప్టెంబర్ 17
  • డిసెంబర్ 7 2023లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది
  • స్వేచ్ఛ స్వతంత్ర్యంకోసం ఎంతో మంది అమరులయ్యారు
  • పదేళ్లు నియంత నిర్భందంలో ప్రజలు మగ్గారు
  • ప్రపంచ ఉద్యమాల చరిత్రలో సాయుధ పోరాట చరిత్ర గొప్పది
  • సాయుధ పోరాట స్ఫూర్తితో పోరాడి మళ్లీ ప్రజాపాలన తెచ్చుకున్నాం
  •  70 ఏళ్ల సాయుధపోరాటమే స్ఫూర్తే మాకు ఆదర్శం
  •  ప్రజాపాలనలో బంధుప్రీతికి చోటు లేదు
  • పాలనలో తప్పులుంటే సరిదిద్దుకుంటున్నాం
  • విద్య,వైద్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం
  • గొప్ప విజన్ తో యంగ్ ఇండియా స్కూళ్లు తెచ్చాం
  • విప్లవాత్మక మార్పుకు యంగ్ ఇండియా స్కూళ్లు నాంది
  • విద్యతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం
  • రేపటి తరాన్ని స్వీయ శక్తిమంతులుగా మారుస్తాం
  • భూమి కోసం,భుక్తి కోసం, విముక్తి కోసం వీరవనితలు పోరాడారు
  • మల్లు స్వరాజ్యం,ఆరుట్ల, కమలాదేవీ పోరాట స్ఫూర్తి నింపారు
  • కోటి ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు కృషి  చేస్తున్నాం
  • డ్వాక్వా మహిళ సంఘాలకు ఎన్నో ప్రోత్సహకాలు ఇస్తున్నాం
  •  ఆహార ధాన్యాల కొరత నుంచి మిగులు  సాధించాం
  •  హరిత విప్లవం నుంచి రుణమాఫీ వరకు కాంగ్రెస్ విజయాలు
  • 25లక్షల 35 వేల మందికి20.60కోట్ల రుణమాఫీ చేశాం
  • 9 రోజుల్లో 9వేల కోట్ల రైతు భరోసా జమచేశాం
  • ఏడాదిలోనే  రైతులకు లక్షా 4 వేల కోట్లు లబ్ధి చేకూరింది
  • 29లక్షల విద్యుత్ మోటార్లకు 16.6 కోట్ల సబ్సిడి ఇచ్చాం
  • 2.9 కోట్ల టన్ను ధాన్యం ఉత్ప్తిలో తెలంగాణ దేశానికే ఆదర్శం
  • తొలి 20 నెలల్లోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
  • సర్కార్ ఆర్థిక సాయంతో 10 మంది సివిల్ సర్వీస్ కు ఎంపికయ్యారు
  • 5 వేల గ్రామాలకు పాలన అధికారులను నియమించాం
  • 42 శాతం బీసీ కోటాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
  •  బీసీ కోటాతో 23 వేల 973 మందికి రాజకీయ ప్రాతినిధ్యం
  • ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ
  • 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్ ఇస్తున్నాం
  • ఏటా ఫిబ్రవరి 4న తెలంగాణ సోషల్ జస్టిస్ గా చేసుకుంటున్నాం
  • గత ప్రభుత్వ పాలకులు డబుల్ బెడ్రూం ఇళ్లతో ఆటలాడారు
  • తొలివిడతో 22.5 వేల కోట్లతో ప్రతి సెగ్మెంట్ కు 3వేల ఇండ్లు మంజూరు  చేశాం
  • 5 లక్షల కొత్త రేషన్ కార్డులిచ్చాం
  • 3.1 కోట్ల మంది రోజూ సన్నబియ్యంతో బువ్వ తింటున్నారు
  • నది జలాల్లో రాజీపడం..ఒక్కచుక్క నీటిని వదులుకోం
  • కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన 904టీఎంసీల వాటా సాధిస్తాం
  • 2027డిసెంబర్ నాటికి ఎస్ఎల్ బీసీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం
  •  హైదరాబద్ సిటీ మన బలం మన బ్రాండ్
  • 2035 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమియ మన టార్గెట్
  • లక్షల కోట్ల అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్  కేరాఫ్
  •  గ్లోబల్  కెపబులిటీ సెంటర్ల  హబ్ గా హైదరాబాద్
  •  హైదరాబాద్ కు వందేళ్ల పాటు తాగునీటి తిప్పలు రాకుండా చర్యలు 
  • 7360 కోట్లతో గోదావరి ఫేజ్ 2 ,3  పనులు మొదలు పెట్టాం
  •  హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఫెంచేలా మూసీ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్
  • రూ. 24 వేల కోట్లతో 76.4 కి.మీ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం
  • గత పదేళ్లలో హైదరాబాద్ డ్రగ్స్ కు గేట్ వేగా మారింది
  • డ్రగ్స్ గంజాయి వ్యాపారంలో ఎంత పెద్దొళ్లు ఉన్నా వదిలే ప్రసక్తే లేదు
  • ఫాంహౌస్ లలో గంజాయి పండించి అమ్ముతామంటే ఊరుకోం
  •  డ్రగ్స్ కట్టడి కొందరికి నచ్చకపోవచ్చు
  • 138 దేశాలు పాల్గొన్న వరల్డ్ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఫస్ట్ ప్రైజ్ 
  • ఫ్యూచర్ సిటినీ అందరికి నచ్చేలా నిర్మిస్తాం
  • 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ నిర్మించబోతున్నాం
  • ఫ్యూచర్ సిటీపై అందరికి అవగాహన కల్పిస్తాం
  • గొప్ప నగరాన్నినిర్మించుకునే అవకాశం దక్కింది 
  • ఫ్యచర్ సిటీ నిర్మాణంలో  రైతులు సహా అందరు ముందుకు రావాలి