ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఏప్రిల్ 6న బాసరకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి..పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  •     సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు

బాసర, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఈ నెల 6న బాసరలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు  దేవాదాయ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు మంగళవారం బాసరకు వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అభిలాష అభినవ్‌‌‌‌‌‌‌‌తో చర్చించారు.

ముందుగా.. ఆలయ ప్రాంగణంలో సీఎం శంకుస్థాపనలు చేయనున్న పలు నిర్మాణాలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించారు. పనుల ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం ఈవో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌లో కమిషనర్‌‌‌‌‌‌‌‌ హనుమంతరావు మాట్లాడారు.

బాసర ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో పేరుందని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఘాట్లకు రిపేర్లు చేయడంతో పాటు కొత్త ఘాట్లు నిర్మిస్తామని చెప్పారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, భైంసా సబ్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ అజ్మీరా సంకేత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, ఈవో విజయరామారావు, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ పవన్‌‌‌‌‌‌‌‌ చంద్ర ఉన్నారు.