
నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, నల్గొండ జిల్లా ఎమ్మెల్యేల తోపాటు ఇతర అధికారులతో కలిసి ప్లాంట్ ని పరిశీలించారరు. థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. పనులు ఏ దశలో ఉన్నాయి..? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు .
ఇప్పటికే పవర్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు 2015లో ప్రారంభమయ్యాయి. మొత్తం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. పవర్ ప్లాంట్ లోని 12వ ఫ్లోర్ లో సీఎం పనులు పరిశీలించారు.అనంతరం అధికారులతో కలిసి సమీక్ష నిర్వహిస్తున్నారు.