కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు.. ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ జర్నీ: విజయ్ ప్రభుత్వం కీలక ప్రకటన

కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు.. ట్రాన్స్ జెండర్లకు ఫ్రీ జర్నీ: విజయ్ ప్రభుత్వం కీలక ప్రకటన

సీఎం విజయ్ ప్రభుత్వం సంక్షేమంలో దూసుకుపోతోంది. ఒక్కొక్కటిగా పథకాలు అమలు చేసేకుంటూ పాలనపై పట్టు సాగిస్తోంది. ఇప్పటికే పలు కీలక పథకాలు అమలు చేసిన తమిళనాడు ప్రభుత్వం.. లేటెస్టుగా ఫ్రీ సిలిండర్లు, ఉచిత ప్రయాణంపై కీలక ప్రకటన చేసింది. కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వనున్నట్లు సీఎం జోసెఫ్ విజయ్ ప్రకటించారు .అదే విధంగా ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు 2026 ఆగస్టు 24న ప్రకటించారు 

కుటుంబ ఆదాయం రెండున్నర లక్షల రూపాయలలోపు ఉన్న వారికి ఉచితంగా మూడు సిలిండర్లు అందించనున్నారు. అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద.. దాదాపు కోటి 30 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ఏడాదికి 4 వేల కోట్ల రూపాయల ఖర్చు అవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ స్కీం కింద మూడు సిలిండర్ల ఖర్చు డబ్బును డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ చేయనుంది ప్రభుత్వం. సిలిండర్ కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు క్రెడిట్ అవుతాయని సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. 

ఇక ట్రాన్స్ జెండర్లకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించిన సీఎం.. వెట్రి ప్రయాణ తిట్టమ్ స్కీమ్ ను మహిలలకు కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ప్రకారం మహిళలు ఆర్డినరీ బస్సుల్లోనే కాకుండా, ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణాలు చేయవచ్చునని చెప్పారు. ఈ పథకాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్నారు. 

ఇక పరందూర్ విమానాశ్రయం విషయంలో టీవీకే ప్రభుత్వ స్టాండ్ మారదని చెప్పారు. రైతులను నిర్వాసితులు చేసే ప్రాజెక్టు జోలికి వెళ్లమని.. రైతులకు ఇబ్బంది కలగకుండా.. భూసేకరణ సులువుగా జరిగే ప్రాంతం చూసి కొత్త విమానాశ్రయం నిర్మిస్తామని చెప్పారు. కొత్త చెన్నై విమానాశ్రయం కోసం అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.