చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్.
మొత్తం ఖాళీలు: 60.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కెమికల్/ పెట్రోలియం/ పెట్రోకెమికల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. మూడేళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2026, జులై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళలకు ఫీజు ఉండదు.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 11.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్: సెప్టెంబర్/ అక్టోబర్.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.cpcl.co.inను సందర్శించండి.
