
వైద్యశాఖలో ప్రక్షాళన కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. సర్కారీ దవాఖానాలను తనిఖీ చేస్తూ పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటున్నారు. శనివారం షహరాన్ పూర్ జిల్లా ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఆదివారంరోజున మొరాదాబాద్ జిల్లా హాస్పిటల్ ను పరిశీలించారు.
మొరాదాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో అన్ని గదులకు వెళ్లి రోగులతో మాట్లాడారు సీఎం యోగీ ఆదిత్యనాథ్. ఆస్పత్రిలో అందుతున్న చికిత్సలు, సేవల గురించి అడిగి తెల్సుకున్నారు. డాక్టర్లు, ఉన్నతాధికారులతో సమావేశమై.. ఆస్పత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు యోగీ ఆదిత్యనాథ్. హస్పిటల్ కు వచ్చిన ముఖ్యమంత్రికి తమ సమస్యలు చెప్పుకున్నారు రోగులు, వారి బంధువులు.